టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి | TDP series of continuous training | Sakshi
Sakshi News home page

టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి

Jan 1 2017 2:36 AM | Updated on Sep 5 2017 12:03 AM

టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి

టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి

పార్టీ మహానాడు ముగిశాక, టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి చెప్పారు.

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మహానాడు ముగిశాక, టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి చెప్పారు. శనివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు మండల, డివిజన్‌ కమిటీల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు ఉంటుందన్నారు.

నెరవేరని .. తెలంగాణ ఆశయం: రావుల   
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం సాధించుకుని 31నెలలు పూర్త వుతున్నా, తెలంగాణ ఆశయం మాత్రం ఇంకా నెరవేరలే దని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షగా మిగిలిపోయా యని, దానికి గృహనిర్మాణ పథకమే ఉదాహరణ అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్ లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి దాకా కట్టిన ఇళ్లు 1,217 మాత్రమే కావడం శోచనీయమన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా, లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా 20 ఏళ్లు పడుతుందన్నారు. రైతులను, పేదలను మభ్యపెట్టిన సంవత్సరంగా 2016 మిగిలిపోతుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement