breaking news
inugala peddi Reddy
-
టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పెద్దిరెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో గతంలో తామిద్దరం కలిసి పని చేసినట్లు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. -
టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ మహానాడు ముగిశాక, టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు మండల, డివిజన్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు ఉంటుందన్నారు. నెరవేరని .. తెలంగాణ ఆశయం: రావుల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సాధించుకుని 31నెలలు పూర్త వుతున్నా, తెలంగాణ ఆశయం మాత్రం ఇంకా నెరవేరలే దని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షగా మిగిలిపోయా యని, దానికి గృహనిర్మాణ పథకమే ఉదాహరణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి దాకా కట్టిన ఇళ్లు 1,217 మాత్రమే కావడం శోచనీయమన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా, లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా 20 ఏళ్లు పడుతుందన్నారు. రైతులను, పేదలను మభ్యపెట్టిన సంవత్సరంగా 2016 మిగిలిపోతుందన్నారు.