
'కేసీఆర్ స్వయంగా ఆహ్వనిస్తే బాగుండేది'
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ స్వయంగా ఆహ్వనిస్తే బాగుండేదని వీరు అభిప్రాయపడ్డారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెల్లాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కాగా, కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది.