చర్చలు విఫలం కాలేదు


ఈ నెల 23వ తేదీకి వాయిదా పడ్డాయి

- సమ్మె పిలుపు చట్ట వ్యతిరేకం.. విధులకు రండి

- డైరెక్టర్‌ (ఫైనాన్స్, పా) జె.పవిత్రన్‌ కుమార్‌ పిలుపు

23న చర్చలకు నోటీసు జారీ చేసిన డిప్యూటీ సీఎల్‌సీ

 

సాక్షి, మంచిర్యాల: వారసత్వ ఉద్యోగాలపై డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కాలేదని, ఈనెల 23వ తేదీకి వాయిదా పడ్డాయని సింగరేణి సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) జె.పవిత్రన్‌ కుమార్‌ తెలిపారు. ఈ పరిస్థితుల్లో కార్మికు లెవ్వరూ సమ్మెలో పాల్గొనవద్దని, యథాతథంగా విధులకు హాజరు కావాలని ఆయన బుధవా రం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధర ణపై ఈనెల 13న డిప్యూటీ సీఎల్‌సీ శ్యాం సుందర్‌ సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు కొన్ని కొత్త ప్రతిపాదనలు అందిం చాయని, వాటి మీద న్యాయ నిపుణులతో చర్చించేందుకు వారం రోజుల సమయం కోరినట్లు చెప్పారు.



అయితే కార్మిక సంఘాలు కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిం చకుండా తమంత తామే చర్చలు విఫల మైనట్లు ప్రకటించుకొని చర్చల నుంచి వెళ్లిపోయారని తెలిపారు. డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ మాత్రం చర్చలు విఫలమైనట్లు అంగీకరిం చలేదని, కేవలం 23వ తేదీకి వాయిదా వేసినట్లుగానే నోటీసు జారీ చేశారని వివరిం చారు. పారిశ్రామిక సం బంధాల చట్టం ప్రకారం చర్చలు మధ్యలో కొనసాగు తుండగా, సమ్మెకు పోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఈ నేపథ్యంలో సమ్మె యోచన ను విరమించాలని ఆయన కార్మికులకు, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు.



వారసత్వ ఉద్యోగాల విషయంలో యూనియన్లు గత నెల 25వ తేదీన కొన్ని ప్రతిపాదనలు అందజేశాయని, వీటిపై కంపెనీ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న పరిస్థితుల్లో 13వ తేదీ చర్చల్లో సరికొత్త ప్రతిపాదనలు వచ్చాయని , వాటిపై 24 గంటల్లోనే నిర్ణయం వెల్లడించాలని పట్టుప ట్టాయని ఆయన చెప్పారు. సమస్య తీవ్రత, కోర్టు తీర్పుల నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్త ప్రతిపాదనలపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరని భావించిందని, దీనికి వారం రోజుల గడువు కోరినట్లు చెప్పారు. తమ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎల్‌సీ ఏకీభవించారని, కార్మిక సంఘాలు మాత్రం వాస్తవాన్ని అవగాహన చేసుకోకుండా ఒక్కరోజులోనే నిర్ణయం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వెళ్లిపోవడం విచారకరమన్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top