breaking news
Legacy jobs
-
సమ్మె పట్టు తప్పుతోంది..!
పాల్గొనాలని కార్మిక సంఘాల ఇంటింటి ప్రచారం రుద్రంపూర్ (భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణిలో సమ్మె ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రోజురోజుకీ విధులకు హాజరయ్యే కార్మికుల శాతం పెరుగు తోంది. ఆదివారం ప్లేడేగా యాజమాన్యం ప్రకటించడంతో 53.09 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలో అధికారులు ఉత్తమ కార్మికులతో కలసి విధుల్లో పాల్గొనా లంటూ ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు ఏరియాలో ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు కార్మికుల ఇళ్లకు వెళ్లి సమ్మెలో పాల్గొనాలని కోరారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 15 నుంచి సమ్మెలోకి దిగాయి. సగటు కన్నా పెరిగిన ఉత్పత్తి : సింగరేణి యాజమాన్యం సాక్షి, మంచిర్యాల: సింగరేణిలో సమ్మె ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, సెలవు దినమైన ఆదివారం కూడా సమ్మెపై కార్మికుల్లో స్పందన లేదని సింగరేణి యాజ మాన్యం తెలిపింది. సాధారణ హాజరుతో పోలిస్తే సెలవుదినమైన ఆదివారం 77 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని వివరించారు. -
చర్చలు విఫలం కాలేదు
ఈ నెల 23వ తేదీకి వాయిదా పడ్డాయి - సమ్మె పిలుపు చట్ట వ్యతిరేకం.. విధులకు రండి - డైరెక్టర్ (ఫైనాన్స్, పా) జె.పవిత్రన్ కుమార్ పిలుపు - 23న చర్చలకు నోటీసు జారీ చేసిన డిప్యూటీ సీఎల్సీ సాక్షి, మంచిర్యాల: వారసత్వ ఉద్యోగాలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కాలేదని, ఈనెల 23వ తేదీకి వాయిదా పడ్డాయని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) జె.పవిత్రన్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో కార్మికు లెవ్వరూ సమ్మెలో పాల్గొనవద్దని, యథాతథంగా విధులకు హాజరు కావాలని ఆయన బుధవా రం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధర ణపై ఈనెల 13న డిప్యూటీ సీఎల్సీ శ్యాం సుందర్ సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు కొన్ని కొత్త ప్రతిపాదనలు అందిం చాయని, వాటి మీద న్యాయ నిపుణులతో చర్చించేందుకు వారం రోజుల సమయం కోరినట్లు చెప్పారు. అయితే కార్మిక సంఘాలు కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిం చకుండా తమంత తామే చర్చలు విఫల మైనట్లు ప్రకటించుకొని చర్చల నుంచి వెళ్లిపోయారని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ మాత్రం చర్చలు విఫలమైనట్లు అంగీకరిం చలేదని, కేవలం 23వ తేదీకి వాయిదా వేసినట్లుగానే నోటీసు జారీ చేశారని వివరిం చారు. పారిశ్రామిక సం బంధాల చట్టం ప్రకారం చర్చలు మధ్యలో కొనసాగు తుండగా, సమ్మెకు పోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఈ నేపథ్యంలో సమ్మె యోచన ను విరమించాలని ఆయన కార్మికులకు, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో యూనియన్లు గత నెల 25వ తేదీన కొన్ని ప్రతిపాదనలు అందజేశాయని, వీటిపై కంపెనీ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న పరిస్థితుల్లో 13వ తేదీ చర్చల్లో సరికొత్త ప్రతిపాదనలు వచ్చాయని , వాటిపై 24 గంటల్లోనే నిర్ణయం వెల్లడించాలని పట్టుప ట్టాయని ఆయన చెప్పారు. సమస్య తీవ్రత, కోర్టు తీర్పుల నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్త ప్రతిపాదనలపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరని భావించిందని, దీనికి వారం రోజుల గడువు కోరినట్లు చెప్పారు. తమ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎల్సీ ఏకీభవించారని, కార్మిక సంఘాలు మాత్రం వాస్తవాన్ని అవగాహన చేసుకోకుండా ఒక్కరోజులోనే నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేస్తూ వెళ్లిపోవడం విచారకరమన్నారు. -
వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం : వెంకట్రావ్
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రసిడెంట్ వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1 గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలు, సకల జనుల సమ్మె కాలపు వేతనాలు, కార్మికులకు సొంతింటి విషయంలో సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నప్పటికీ గుర్తిం పు సంఘం వైఫల్యం వల్లే ఆలస్యమవుతోందన్నారు. టీబీజీకేఎస్ తీరువల్లే ఇప్పటి వరకు 16 స్ట్రక్చర్, జేసీసీ సమావేశాలు జరగక అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. భూగర్భగనుల్లో ఆధునిక యం త్రాల నిర్వహణను కాంట్రాక్టుకు ఇవ్వడంపై కార్మిక సంఘాలతో కలుపుకొని సమ్మె చేస్తామని హెచ్చరించారు. నాయకులు గౌతం శంకరయ్య, జక్కుల దామోదర్‌రావు,నాయిని మల్లేష్,దల్నాయక్ సాంబయ్య, దాస రి మల్లేష్, ర వీందర్, సమ్మయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.