వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం : వెంకట్రావ్ | Legacy jobs can be sure of: venkatrav | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం : వెంకట్రావ్

Apr 23 2016 12:43 AM | Updated on Sep 3 2017 10:31 PM

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రసిడెంట్ వెంకట్రావ్ ...

యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రసిడెంట్ వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1 గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలు, సకల జనుల సమ్మె కాలపు వేతనాలు, కార్మికులకు సొంతింటి విషయంలో సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నప్పటికీ గుర్తిం పు సంఘం వైఫల్యం వల్లే ఆలస్యమవుతోందన్నారు. టీబీజీకేఎస్ తీరువల్లే ఇప్పటి వరకు 16 స్ట్రక్చర్, జేసీసీ సమావేశాలు జరగక అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.


భూగర్భగనుల్లో ఆధునిక యం త్రాల నిర్వహణను కాంట్రాక్టుకు ఇవ్వడంపై కార్మిక సంఘాలతో కలుపుకొని సమ్మె చేస్తామని హెచ్చరించారు. నాయకులు గౌతం శంకరయ్య, జక్కుల దామోదర్‌రావు,నాయిని మల్లేష్,దల్‌నాయక్ సాంబయ్య, దాస రి మల్లేష్, ర వీందర్, సమ్మయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement