నెమ్మదించిన మౌలికం | Key Infrastructure Sectors Growth At 3 Pc In September | Sakshi
Sakshi News home page

నెమ్మదించిన మౌలికం

Oct 22 2025 4:38 AM | Updated on Oct 22 2025 4:38 AM

Key Infrastructure Sectors Growth At 3 Pc In September

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి, నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో నెమ్మదించింది. 3 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 6.5 శాతంగా ఉండగా, గతేడాది  సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తులు .. సహజ వాయువు ఉత్పత్తి తగ్గడంతో 3 నెలల కాలవ్యవధిలో సెప్టెంబర్‌లోనే అత్యల్పంగా మౌలిక వృద్ధి నమోదైంది.

సమీక్షాకాలంలో ఎరువులు, సిమెంటు ఉత్పత్తి వృద్ధి రేటు వరుసగా 1.9 శాతం నుంచి 1.6 శాతానికి, 7.6 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. అయితే, ఉక్కు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– సెప్టెంబర్‌ మధ్యకాలంలో 8 మౌలిక రంగాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 4.3% నుంచి 2.9 శాతానికి నెమ్మదించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement