'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు' | talasani srinivas yadav allegation on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'

Jan 13 2015 10:41 PM | Updated on Sep 2 2017 7:39 PM

'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'

'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ చైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థే ఉంటారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లు ఖర్చు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పారని, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు.

మొత్తం 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది.  ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement