బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత

Talasani Sai Kiran Help to Body Builder Kiran Kumar - Sakshi

సాక్షి’ కథనంపై స్పందించిన తలసాని సాయికిరణ్‌ యాదవ్‌

మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్‌ 12 నుండి 18 వరకు జరుగనున్న మిస్టర్‌ ఏషియన్, మిస్టర్‌ వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ పోటీలకు ఎంపికైన బాడీ బిల్డర్స్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ చేయూతనిచ్చారు. కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్‌ సాధించిన పతకాలతో పాటు మిస్టర్‌ వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ పోటీల ఎంపికకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో  ‘చేయూతనందిస్తే సత్తా చాటుతా’ అనే కథనం సోమవారం ప్రచురితమైంది. తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ స్పందించి కిరణ్‌కుమార్‌ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలను సేకరించారు. పోటీలకు ఎంపికైన కిరణ్‌కుమార్‌తో పాటు మహ్మద్‌ నిజాముద్దీన్‌లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మిస్టర్‌ వరల్డ్‌ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొంటున్న వారికి రానుపోను 6 లక్షల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లను బుక్‌చేశారు (ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున). ఈ సందర్బంగా సాయికిరణ్‌యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తుందని ఆయన అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top