వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు | swin flu case filed in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు

Jan 8 2016 12:29 AM | Updated on Sep 3 2017 3:16 PM

వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌లో ఉప్పోజు స్వరూప (42) అనే మహిళకు స్వైన్‌ప్లూ సోకింది.

రఘునాథపల్లి: వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌లో ఉప్పోజు స్వరూప (42) అనే మహిళకు స్వైన్‌ప్లూ సోకింది. రెండు రోజుల క్రితం ఆమెకు జ్వరం, జలుబు, దగ్గు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు జరిపి స్వరూపకు స్వైన్‌ప్లూ సోకినట్లుగా నిర్ధారించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్‌కు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ వైద్యాధికారులకు సమాచారం అందించగా.. జిల్లా అధికారులు అప్రమత్తమై గురువారం ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తుల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement