వ్యక్తి అనుమానాస్పద మృతి | Suspicious Deth of a person in Adilabad | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Mar 24 2016 10:38 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం ఎన్టీఆర్ కాలనీలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం ఎన్టీఆర్ కాలనీలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాలనీకి చెందిన బాణేష్(35) బుధవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని భార్య శంకరమ్మ పొరుగింటికి వెళ్లి సాయం కోరింది. వారు వచ్చి ఆస్పత్రికి తరలించేలోగానే బాణేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement