breaking news
sankaramma
-
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు
మదనపల్లి: ఒకే కాన్పులో నలుగురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిందో మహిళ. బి.కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయితీ రఘునాథపురం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి భార్య శంకరమ్మ కాన్పు కోసం మదనపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం అర్ధ రాత్రి 12గంటల సమయంలో ఆమె ప్రసవించగా నలుగురూ ఆడపిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం ఎన్టీఆర్ కాలనీలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాలనీకి చెందిన బాణేష్(35) బుధవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని భార్య శంకరమ్మ పొరుగింటికి వెళ్లి సాయం కోరింది. వారు వచ్చి ఆస్పత్రికి తరలించేలోగానే బాణేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.