breaking news
Suspicious Deth
-
దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డి సిల్వా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న కపిల చంద్రసేన అరవింద డి సిల్వా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. అరవింద డిసిల్వా భార్య అనుష్క డి సిల్వా, కపిల చంద్రసేన భార్య ప్రియాంక నియోమలి స్వయానా అక్కా చెల్లెల్లు కావడం గమనార్హం.విషయంలోకి వెళితే.. మే 7న (గురువారం) కపిల చంద్రసేన కొల్లుపిటియాలోని పెడ్రిస్ ప్లేస్‌లో ఉన్న అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అరవింద డిసిల్వా ఇంట్లోని బెడ్రూమ్లో కపిల చంద్రసేన నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడనుంది.ఇటీవలే చంద్రసేన విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి 2 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరణించడానికి ఒక్కరోజు ముందు కొలంబో ప్రధాన న్యాయమూర్తి కపిల చంద్రసేనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని తప్పించకునేందుకు అరవింద డిసిల్వా ఇంటికి వచ్చారా లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కపిల చంద్రసేన మరణ వార్త తెలియగానే లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్లో మూలస్తంభాల్లో ఒకడిగా అరవింద డిసిల్వా గుర్తింపు పొందాడు. లంక జట్టు 1996 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో అరవింద డిసిల్వాది కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌లోని లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 1996 ప్రపంచకప్ ఫైనల్లో చేజింగ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన డిసిల్వా తన జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అరవింద డిసిల్వా లంక తరఫున 93 టెస్టులు, 308 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి 15వేలకు పైగా పరుగులు సాధించిన అరవింద డిసిల్వా 31 సెంచరీలు, 86 అర్థసెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ డిసిల్వా రెండు ఫార్మాట్లు కలిపి 135 వికెట్లు పడగొట్టాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో శ్రీలంక ఓటమి అనంతరం అరవింద డిసిల్వా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.చదవండి: ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్! -
ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు తెలిసింది.(చదవండి: భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు) నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీష్ బయటకు వెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో గొడవ పడిన నీలిమాని పోలీసులు విచారిస్తున్నారు. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు) -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం ఎన్టీఆర్ కాలనీలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాలనీకి చెందిన బాణేష్(35) బుధవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని భార్య శంకరమ్మ పొరుగింటికి వెళ్లి సాయం కోరింది. వారు వచ్చి ఆస్పత్రికి తరలించేలోగానే బాణేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


