ప్రాణాలు తీసిన పందెం | survivors were taken bet | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన పందెం

Jul 12 2015 12:45 AM | Updated on Sep 3 2017 5:19 AM

ప్రాణాలు తీసిన పందెం

ప్రాణాలు తీసిన పందెం

నీళ్లు కలపకుండా.. ఎత్తిన బాటిల్ దింపకుండా మందు తాగుతానని ఛాలెంజ్ చేసి మరీ ఐదు క్వార్టర్లు తాగాడు. చివరికి

బాటిల్ దింపకుండా తాగుతానని బెట్
 ఐదు క్వార్టర్లు తాగి.. అనంతలోకాలకు..


 కౌడిపల్లి: నీళ్లు కలపకుండా.. ఎత్తిన బాటిల్ దింపకుండా మందు తాగుతానని ఛాలెంజ్ చేసి మరీ ఐదు క్వార్టర్లు తాగాడు. చివరికి అపస్మారక స్థితికి చేరి అనంతలోకాలకు చేరాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.

చిట్కుల్ గ్రామానికి చెందిన రాయన్నోళ్ల రాయన్న(45) శుక్రవారం తన స్నేహితులతో  ఎవరు ఎక్కువ మద్యం తాగుతారన్న అంశంలో ఎత్తిన బాటిల్ దించకుండా మందు తాగుతానని పందెం కట్టాడు. వరుసగా ఐదు క్వార్టర్ బాటిళ్లు తాగాడు. దీంతో రాయన్న అపస్మారక స్థితికి వెళ్లగా, స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శనివారం మరణించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement