మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గిన టీ సర్కార్ | Succumb to the pressure of the Majlis telengana govt | Sakshi
Sakshi News home page

మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గిన టీ సర్కార్

Sep 16 2014 1:34 AM | Updated on Mar 29 2019 9:24 PM

మజ్లిస్ నేతల ఒత్తిడికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తలొగ్గుతోందని, ఫలి తంగానే ‘సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: లక్ష్మణ్
 
హైదరాబాద్:   మజ్లిస్ నేతల ఒత్తిడికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తలొగ్గుతోందని, ఫలి తంగానే ‘సెప్టెంబర్ 17  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అధికారికంగా సానుకూల ప్రకటన చేస్తే సరే సరి...  లేదంటే బీజేపీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకొనేది త్వరలో వెల్లడిస్తామని సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.  బతుకవ్ము పండుగకు  నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ వరద బాధితులను ఆదుకొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలంతా నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు లక్ష్మణ్ ప్రకటించారు.

సర్కారే నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే  నిర్వహించాలంటూ  బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ,  బీజేపీఎల్‌పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ లోధా లు సీఎం కేసీఆర్‌ను సోమవారం కలసి వినతిపత్రం అందజేశారు.  కాగా,  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement