
ఉస్మానియా యూనివర్సిటీ: డిగ్రీ వరకు చదివి ఉపాధి చూసుకోవాలని నేటి యువత భావిస్తోంది. అయితే ప్రతి ఏటా డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రవేశాలు మొదలు ఫీజులు, పరీక్షలు, ఫలితాలు, ప్రాక్టికల్స్, అటెండెన్స్, డిటెన్షన్ తదితరల కారణంగా వందలాది మంది విద్యార్థులు డిగ్రీ చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. వీటికి తోడు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా చేపట్టిన డిగ్రీ ప్రవేశాలు ప్రహసనంగా మారాయి. జూన్ నుంచి దోస్తు ద్వారా ఆన్‌లైన్ ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ స్పాట్ ఈనెల 22న ముగియనుంది. మూడు నెలలుగా జరుగుతున్న ప్రవేశాలలో అనుకున్న కాలేజీల్లో సీటు లభించక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఒక పక్క తరగతులు కొనసాగతుండగా మరోవైపు స్పాట్ అడ్మిషన్ల కోసం గడువు ఈ నెల 22 æ వరకు పొడిగించారు. ప్రవేశాలు ప్రణాళిక బద్ధంగా జరగకపోవడంతో పరీక్షలు, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం ప్రవేశ పెట్టినాటి నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి సెమిస్టర్‌కు 90 రోజులు తరగతులు జరగాలి. కాని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతంది. దోస్త్‌లో ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించడంతో మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు అనుకున్న కాలేజీల్లో సీటు లభించక పోవడంతో అటుతిరిగి...ఇటు తిరిగి చదవు మానేస్తున్నారు.
సీట్ల కేటాయింపులో మార్పులు అవసరం
దోస్త్ అడ్మిషన్లను విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారు. కానీ సీట్ల కేటాయింపు విషయంలో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకొని మండల, జిల్లాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థి నివాసం నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు గల కాలేజీల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుందన్నారు.
ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం
డిగ్రీలో చేరే వారి సంఖ్య ప్రతి ఏటా తగ్గుతున్నా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ కాలేజీలను నియంత్రిస్తున్నాం అనే ఆనందంలో ఉన్నారు. కానీ నిరు పేద విద్యార్థులకు సైతం డిగ్రీ కోర్సులు చదివేలా ఇంటింటికీ తిరిగి డిగ్రీ సీట్లు ఇచ్చి చదువుకునే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర పేద విద్యార్థులకు ఉచితంగా కూడా సీట్లు ఇచ్చే వారు. కొన్ని ప్రభుత్వ కాలేజీలు అధ్వానంగా ఉన్న కొనసాగిస్తున్నారు. కొందరురాష్ట్ర ఉన్నత విద్య మండలి అధికారులు డిగ్రీ కాలేజీల సంఖ్యను తగ్గిస్తు ప్రభుత్వానికి మేలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో ఉన్నత విద్య తగ్గుదలకు దారి తీస్తున్నారు.కాలేజీలో సకాలంలో సీటు ఇచ్చి స్వేచ్చగా చదివే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.