అనుమానాస్పదంగా మృతి చెందిన డిగ్రీ విద్యార్థి నరేష్ మృతి మిస్టరీగా మారింది.
పుటాన్‌దొడ్డిలో కలకలం
ఇటిక్యాల : అనుమానాస్పదంగా మృతి చెందిన డిగ్రీ విద్యార్థి నరేష్ మృతి మిస్టరీగా మారింది. ఇటిక్యాల మండలం పుటాన్‌దొడ్డికి చెందిన డిగ్రీ విద్యార్థి నరేష్ చేతులు, తల లేకుండా గత సోమవారం రాత్రి వేముల గ్రామ రైల్వేగేట్ 112 సమీపంలో రైల్వేపట్టాల మధ్య కనిపించడం సంచలనం సృష్టించింది. రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని శవానికి పంచ నామా నిర్వహించి చేతులు దులుపుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున రైతు కేశవరెడ్డి వేముల శివారులోని తనపొలాన్ని ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా నరేష్ తల లభించింది. దీంతో నరేష్‌ది హత్యేనని పలువురు అంటున్నారు. విషయం తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుర్తించి, గద్వాల రైల్వే పోలీసులకు తెలిపారు. వారు తలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాలకు తీసుకెళ్లారు.