విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ భగ్నం

Student and unemployment threatened the House - Sakshi

నేతలు, విద్యార్థుల అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చి నాలుగున్నరేళ్లయినా తమకు ఉద్యోగాలు రాలేదంటూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆదివారం ఉస్మానియా వర్సిటీలో తలపెట్టిన ఆవేదన సభను పోలీసులు భగ్నం చేశారు. జేఏసీ చైర్మన్‌ మానవతరాయ్‌ ఆధ్వర్యంలో వందలాది విద్యార్థులు లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వద్దకు చేరుకున్నారు. జేఏసీ నేతలు, కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడిన తర్వాత సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని విద్యార్థులను చెదరగొట్టారు.

దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు అతికష్టం మీద మానవతరాయ్, జేఏసీ నేత దయాకర్‌గౌడ్‌లతో పాటు మరో ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టు అన్యాయమని, వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ, ఓయూ ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top