ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి స్వా ధీనం ....
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి స్వా ధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి ంచింది. తమ నుంచి చెరుకు కొనుగోలు చేసి నా ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బు చెల్లించడం లేదని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని ఇటీవల ఆ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం వాస్తవాలపై నివేదిక తెప్పించుకున్నారు.
రైతులకు డబ్బు చెల్లించడం లేదంటే ఫ్యాక్టరీని నడపాలనే ఉద్దేశం యాజమాన్యానికి ఉన్నట్టుగా లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రైతులను, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీని నిర్వహించాలని నిర్ణయించిన సీఎం విధి విధానాలు రూపొందించాల్సిందిగా కార్యదర్శుల కమిటీని అదేశించారు. రైతుల బకాయిలను తామే చెల్లించి ఫ్యాక్టరీని నడిపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారని బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.