మల్లన్నకు పెద్దపట్నం | Sri Krishnashtami celebrations in cheryala | Sakshi
Sakshi News home page

మల్లన్నకు పెద్దపట్నం

Sep 6 2015 1:53 AM | Updated on Sep 3 2017 8:48 AM

మల్లన్నకు పెద్దపట్నం

మల్లన్నకు పెద్దపట్నం

వరంగల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో రేపల్లెను తలపించేలా శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు..

చేర్యాల: వరంగల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో రేపల్లెను తలపించేలా శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నుండి ఒగ్గు పూజారులు మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. స్వామికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం ఆలయ గంగిరేగు చెట్టు వద్ద ఉట్టి ఏర్పాటు చేశారు. అక్కడే 31 వరుసలతో పంచరంగులతో పెద్ద పట్నం తయారు చేసి పట్నం వేశారు. గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామి సన్నిధిలో ఉట్టిని కొట్టి పెద్దపట్నంను దాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement