
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే ప్రక్రియను వేగిరం చేయాలని వివిధ ఏజెన్సీలను నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఆయా ప్రాజెక్టుల పనులపై సమీక్షించిన ఆయన మోటార్ల బిగింపు ప్రక్రియను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి తోటపల్లి పంప్ హౌజ్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. బిల్లుల చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగేలా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.