కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Kacheguda-Kakinada | Sakshi
Sakshi News home page

కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

May 27 2017 12:24 AM | Updated on Sep 5 2017 12:03 PM

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–కాకినాడ (07425/07426) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–కాకినాడ (07425/07426) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో  తెలిపారు. జూన్‌ 2, 9, 16, 23 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 5.50కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి  కాచిగూడ చేరుకుంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement