కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు | Sons killed mother | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు

Jul 28 2016 8:14 PM | Updated on Jul 30 2018 8:29 PM

కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు - Sakshi

కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు

మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపారు ఇద్దరు ప్రబుద్ధులు.

నార్కట్‌పల్లి (నల్గొండ జిల్లా) : నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గద్దకూటిబావిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపారు తనయులు. గ్రామానికి చెందిన భోగిని పిచ్చమ్మ(48)అనే మహిళకు వెంకన్న, నరేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో దశ దిన కర్మ జరుగుతోంది. ఈ సందర్భంగా వారు విపరీతంగా మద్యం తాగారు. దీంతో తల్లి కుమారులను అతిగా తాగద్దని వారించింది. ఆగ్రహించిన కుమారులు తల్లిని విపరీతంగా కొట్టి పురుగుల మందు బలవంతంగా తాగించారు.

అదే సమయంలో వారి భార్యలు అడ్డురాగా వారి కూడా విపరీతంగా కొట్టారు. ఈ సమయంలో పిచ్చమ్మ వారి నుంచి తప్పించుకుని వెళ్తుండగా మళ్లీ ఆమెను పట్టుకుని గదిలో బంధించారు. పరిస్థితి విషమించి పిచ్చమ్మ అక్కడ్నే ప్రాణాలు వదిలేసింది. ఈమేరకు గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పొలాల్లో దాక్కున్న నిందితులను స్టేషన్‌కు తరలించారు. నిందితుల భార్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement