అందరూ ఉన్న అనాథ

Son Who Does Not Come To Mother Cremation Kazipet - Sakshi

తల్లిని కడసారి చూడటానికి రాని కొడుకు 

ఆశ్రమం ఆధ్వర్యంలో అంత్యక్రియలు

కాజీపేట: బతికి ఉండగా కన్నతల్లికి పిడికెడు అన్నం పెట్టకుండా రోడ్డున పడేసి అనాథ ఆశ్రమం పాల్జేశాడు ఓ కొడుకు. తల్లి మరణించిందని తెలిసినా కడసారి చూడటానికి సైతం రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులే దహన సంస్కారాలు నిర్వహించిన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన శ్యామలయ్య (72)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత భర్త చనిపోవడంతో శ్యామలమ్మ ఒంటరిగా మిగిలింది. 

కొడుకు తల్లికి పిడికెడు అన్నం పెట్టకపోవడంతో  పస్తులు ఉండాల్సి వచ్చేది. వృద్ధురాలు పడుతున్న బాధను చూడలేక స్థానికులు గత ఏడాది జూన్‌లో ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకులు ఛోటు, యాకుబీ  శ్యామలమ్మను ఆశ్రమానికి తరలించారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్న ఆమె.. బుధవారం అస్వస్థతకు గురై మరణించింది. ఆరీ్టసీలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు వెంకటేశ్వర్లుకు తల్లి మరణించిన విషయం చెప్పినా రాలేదు. దీంతో  నిర్వాహకుల కూతురు ఆఫ్రీన్‌ పర్వేజ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top