సింగరేణి నుంచి సౌరవిద్యుత్తు | Solar power from the Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణి నుంచి సౌరవిద్యుత్తు

Apr 19 2017 2:28 AM | Updated on Oct 22 2018 8:31 PM

సింగరేణి నుంచి సౌరవిద్యుత్తు - Sakshi

సింగరేణి నుంచి సౌరవిద్యుత్తు

బొగ్గు ఉత్పత్తితో మొదలు పెట్టి థర్మల్‌ విద్యుత్‌ వరకు వచ్చిన సింగరేణి సంస్థ మరో అడుగు వేయనుంది.

- 275 మెగావాట్లు లక్ష్యంగా ప్రణాళిక
- 11 ఏరియాల్లో స్థలాల ఎంపిక పూర్తి
- గ్రిడ్‌ సమస్య తొలిగితే మరింత విద్యుత్‌
- రెండువేల మెగావాట్ల దిశగా సింగరేణి


సాక్షి, భూపాలపల్లి: బొగ్గు ఉత్పత్తితో మొదలు పెట్టి థర్మల్‌ విద్యుత్‌ వరకు వచ్చిన సింగరేణి సంస్థ మరో అడుగు వేయనుంది. 2019–20 లోగా కనీసం 240 మెగావాట్ల సౌర్య విద్యు త్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  800 మెగావాట్లకు పెంచే అవకాశం ఉంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ద్వారా వెలువడు తున్న కాలుష్యం కారణంగా కేంద్రం సరికొత్త నిబంధనలు రూపొందించింది. థర్మల్‌ విద్యు త్‌ ఉత్పత్తి చేసే సంస్థలు తమ ఉత్పత్తి సామ ర్థ్యంలో 20 శాతం విద్యుత్‌ను సంప్రదాయే తర వనరులైన గాలి, సోలార్, గ్యాస్‌ ద్వారా ఉత్పత్తి చేయాలి. సింగరేణి సంస్థ మంచి ర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

కేంద్ర నిబంధనల ప్రకారం ఈ ప్లాంటు సామర్థ్యంలో 20 శాతం అంటే 240 మెగావాట్ల విద్యుత్‌ను 2019–20 లోగా తప్పనిసరిగా కాలుష్య రహిత విధానంలో ఉత్పత్తి చేయాలి. దీంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. సింగరేణి పరిధిలో ప్రతీ ఏరియాలో 25 మెగా వాట్ల వంతున 11 ఏరియాలకు కలిపి 275 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ప్రతీ ఏరియాలో ఒకే చోట ఐదెకరాల స్థలాన్ని గుర్తించాల్సిందిగా అన్ని ఏరియాలకు ఆదే శాలు వెళ్లాయి. వీటికి అనుగుణంగా స్థలా లను ఎంపిక చేసి సింగరేణి సంస్థ బిజినెస్‌ వింగ్‌కు పంపారు. సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కష్టం. ఈ గ్రిడ్‌ సమస్యకు పరిష్కారం లభిస్తే మరింత విద్యుత్‌ సాధించవచ్చు. మొత్తంగా సింగరేణి 2 వేల మెగావాట్ల దిశగా దూసుకెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement