ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య | Software engineer refused to marry boyfriend's suicide | Sakshi
Sakshi News home page

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Apr 24 2014 6:10 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - Sakshi

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించించడంతో మనస్తాపం చెంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించించడంతో మనస్తాపం చెంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక (22) కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరింది.  సంజీవరెడ్డినగర్‌లో నివాసముంటున్న ఈమె వరంగల్‌కు చెందిన ఓ యువకుడి ప్రేమలో పడింది. కాగా, పెళ్లి చేసుకోమని కోరడంతో అతను నిరాకరించాడు.  

దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం జేమ్స్‌స్ట్రీట్-సంజీవయ్యనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు ప్రియాంక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

మృతురాలి వద్ద సూసైడ్‌నోట్ దొరికింది. అందులో ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉందని పోలీసులు తెలిపారు. సూసైడ్‌నోట్ ఆధారంగా పోలీసులు ప్రియాంకను ప్రేమపేరుతో వంచించిన యువకుడిపై కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకొనేందుకు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement