ప్రారంభమైన స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ ఫైనల్  పోటీలు

Smart India Hackathon Grand Finale Test - Sakshi

సాక్షి, వరంగ్‌ అర్బన్‌: జిల్లాలోని కాజీపేలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నీట్‌)లో ప్రారంభమైన స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ గ్రాండ్ ఫైనల్ పోటీలు. ఈ పోటీలను శనివారం ఉద​యం  కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీ నుంచి వీడియో కా​​​​​​​​​న్ఫ్‌రెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలు 48 కేంద్రాల్లో 36 గంటల పాటు జరుగనున్నాయి. ఈ పోటీల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ సంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఆవిష్కరణలు చేయనున్న విద్యార్థులు. స్మార్ట్ కమ్యూనికేషన్, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సాగనున్న పోటీలు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top