ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

Sivaji Jayanti celebrations in karimnagar district - Sakshi

ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

కరీంనగర్‌ సిటీ: ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవాన్ని శివాజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ ధర్మయాత్ర చేపట్టారు. కమిటీ అధ్యక్షుడు తోట అర్జున్‌ ఆధ్వర్యంలో మారుతినగర్‌ హన్మాన్‌ ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. నగర పురవీధుల గుండా యాత్ర సాగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిప్యూటీ మేయర్‌ రమేశ్, శివసేన జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.వి.మాధవ్‌రాజు హాజరయ్యారు. సమాజహితం కోసం పని చేసిన శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పెద్ది శివ, చిగుళ్ల అనుష్, శేఖర్, దిలీప్, శేఖర్, శివగణేశ్, వినీత్‌రెడ్డి, అశోక్, రంజిత్, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

బైక్‌ ర్యాలీ
హైందవ సంస్కృతి కీర్తి పతాక శివాజీ అని వీహెచ్‌పీ జాతీయ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు గాజుల రవీందర్‌ అన్నారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, కార్యదర్శి కోమళ్ల రాజేందర్‌రెడ్డి, తోట రాజేందర్, భజరంగ్‌దళ్‌ జిల్లా కన్వీనర్‌ తోట ప్రదీప్, శ్రావణ్‌కుమార్, గుజ్జేటి రాజేందర్‌ పాల్గొన్నారు.

శివసేన ఆధ్వర్యంలో..
శివసేన పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో జయంతి యాత్ర నిర్వహించారు. కిసాన్‌నగర్‌లో గల శివసేన పార్టీ కార్యాలయం నుంచి నగర పురవీధుల గుండా యాత్ర సాగి సర్కస్‌ గ్రౌండ్‌లో ముగిసింది. ముఖ్య అతిథిగా శివసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి దామెర క్రిష్ణ హాజరై యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్, ఇందూర్‌ అధ్యక్షుడు శ్రీహరి, యువసేన నాయకులు రాజేందర్, సట్ల సాయి, చందు, రావుల సాయికిరణ్, క్రాంతికుమార్, గుగ్గిళ్ల సత్యనారాయణ, వంగల ప్రదీప్, కార్తీక్, శ్రీకర్, నర్సింగ్, శివ గణేశ్, అజయ్, సోను, రఘు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top