కేసీకెనాల్‌లో పడి అక్కాచెల్లెళ్లు మృతి | Sisters lying dead in KC Canal | Sakshi
Sakshi News home page

కేసీకెనాల్‌లో పడి అక్కాచెల్లెళ్లు మృతి

Nov 1 2015 7:05 PM | Updated on Sep 3 2017 11:50 AM

ప్రమాద వశాత్తు కేసీకెనాల్ లో పడి అక్కా చెలెళ్ల మృతి.

ప్రమాద వశాత్తు కేసీకెనాల్ లో పడి ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఆలంపూర్ మండలం ర్యాలంపాడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ర్యాలంపాడు గ్రామానికి చెందిన సాలెహ(14), సాదిత(10) కేసీకెనాల్ వద్ద బట్టలు ఉతుకుతుండగా పొరపాటున బకెట్ కెనాల్‌లో పడిపోయింది.

బకెట్ కోసం అక్క నీళ్లలో దిగగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. అక్కను కాపాడబోయి చెల్లెలు సాజిత కూడా మునిగిపోయింది. చెల్లెలు సాదిత మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. అక్క సాలెహ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతోన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement