అవి కేసీఆర్‌తోనే సాధ్యమైంది: సింగిరెడ్డి | Singireddy Niranjan Reddy Talks In Press Meet Over Sub Stations In Nagar Kurnool | Sakshi
Sakshi News home page

అవి కేసీఆర్‌తోనే సాధ్యమైంది: సింగిరెడ్డి

Jul 13 2020 8:24 PM | Updated on Jul 13 2020 9:09 PM

Singireddy Niranjan Reddy Talks In Press Meet Over Sub Stations In Nagar Kurnool - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్: జిల్లాలో 60 ఏళ్లలో 50 సబ్ స్టేషన్లు కడితే ఆరేళ్లలో 58 సబ్ స్టేషన్‌లు కట్టామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంట్, తెలంగాణ రావడం, కేసీఆర్ నాయకత్వం మూలంగానే సాధ్యమయిందన్నారు. 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 60 ఏళ్లు ఏమీ చేయని వారు కూడా 24 గంటల కరెంట్ సరఫరాను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరులో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సీఎం కేసీఆర్‌ మూలంగానే సాధ్యమైందని మంత్రి వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement