సింగరేణిలో సమ్మె పాక్షికం | Singareni Strike has strated as Partial strike for 5 days | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమ్మె పాక్షికం

Jan 7 2015 12:50 AM | Updated on Sep 2 2018 4:23 PM

కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమల్లో అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు చేపట్టిన ఐదు రోజుల సమ్మె సింగరేణిలో మంగళవారం ప్రారంభమైంది.

విధులకు హాజరైన 50 శాతం కార్మికులు
కొత్తగూడెం/గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమల్లో అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు చేపట్టిన ఐదు రోజుల సమ్మె సింగరేణిలో మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు సమ్మె పాక్షికంగానే జరిగింది. గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ సమ్మెకు దూరంగా ఉంది. సమ్మె సందర్భంగా గనులతోపాటు డిపార్ట్‌మెంట్ల వద్ద పోలీసు బలగాలను మోహరింపజేశారు.
 
 సింగరేణి వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 11 ఏరియాల్లో సుమారు 50 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. కాగా, ఎక్కువ శాతం కార్మికులు ఫ్రీ షిఫ్టును ఉపయోగించుకుని విధులకు హాజరయ్యారు. ఉదయం పూట విధులకు హాజరయ్యేందుకు వచ్చేవారిని జేఏసీ నాయకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. సింగరేణివ్యాప్తంగా మంగళవారం 50 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు.
 
 ఉత్పత్తిపై సమ్మెప్రభావం..
 సమ్మెలో 22 వేల మంది కార్మికులు పాల్గొనడం వల్ల ఉత్పత్తిపై ఈ ప్రభావం పడింది. ఓపెన్‌కాస్టు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ భూగర్భ గనుల్లో మాత్రం సమ్మె ప్రభావం కన్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement