హోంమంత్రిని కలిసిన ఎస్సై సిద్ధయ్య భార్య | si sidhaiah's wife met home minister | Sakshi
Sakshi News home page

హోంమంత్రిని కలిసిన ఎస్సై సిద్ధయ్య భార్య

May 23 2015 2:42 AM | Updated on Sep 2 2018 5:06 PM

హోంమంత్రిని కలిసిన ఎస్సై సిద్ధయ్య భార్య - Sakshi

హోంమంత్రిని కలిసిన ఎస్సై సిద్ధయ్య భార్య

నల్గొండ జిల్లాలో ముష్కరుల కాల్పుల్లో మృతి చెందిన ఎస్సై సిద్ధయ్య, హోంగార్డు మహేశ్ కుటుంబ సభ్యులు శుక్రవారం సచివాలయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిశారు.

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ముష్కరుల కాల్పుల్లో మృతి చెందిన ఎస్సై సిద్ధయ్య, హోంగార్డు మహేశ్ కుటుంబ సభ్యులు శుక్రవారం సచివాలయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిశారు. తమకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా, ఇతరత్రా సదుపాయాలకు సంబంధించి చర్చించారు. తనకు గెజిటెడ్ పోస్టు కావాలని సిద్ధయ్య భార్య ధరనీష, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కావాలని మహేశ్ భార్య కోరారు. అలాగే ఎక్స్‌గ్రేషియా కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని నాయిని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement