పింఛన్‌లకు సంబంధించిన ఇంటింటి సర్వే పూర్తి కాగా, ఆన్‌లైన్ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
అంతటా వెబ్‌సైట్‌లు ఓపెన్ చేయడమే కారణం
అనుకున్న సమయంలో పూర్తి కాలేకపోతున్న ఆన్‌లైన్ నమోదు
పింఛన్ పంపిణీలో మరింత జాప్యం సర్వర్ బిజీ
మోర్తాడ్ : పింఛన్‌లకు సంబంధించిన ఇంటింటి సర్వే పూర్తి కాగా, ఆన్‌లైన్ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అన్ని పనులను పక్కకు పెట్టి ఎంపికైన లబ్ధిదా రుల వివరాలను ఆపరేటర్లు రెవెన్యూ కార్యాలయాలలోని కంప్యూటర్‌ల ద్వారాఆన్‌లైన్ చేస్తున్నారు. అన్ని కార్యాలయాలలోనూ ఒకేసారి వెబ్‌సైట్‌లను ఓపెన్ చేయడం తో సర్వర్ బిజీ అయ్యింది. దీంతో వివరాల నమోదుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి రావడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతోంది.
ప్రభుత్వం సీలింగ్‌ను ఎత్తివేయడంతో ఇంకా కొంత మంది లబ్ధిదారు లను ఎంపిక చేయాల్సి ఉంది. సర్వర్ బిజీగా మారడంతో పింఛన్‌ల పంపిణీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి సం బంధించిన ఇతర వెబ్‌సైట్‌లను నిలుపుదల చేసి పింఛన్‌లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చినా సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.