ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి మరో చోరీ జరిగింది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి మరో చోరీ జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలోని ఓ దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. దుకాణం వెనుక వైపు కిటికీ నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.20వేల నగదు ఎత్తుకుపోయారు. దుకాణం యజమాని రాజేందర్ శనివారం ఉదయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పట్టణంలో గురువారం రాత్రి రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి.
(మంచిర్యాల)