సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి | secunderabad cantonment elections; sarvey satyanarayana daughter defeat | Sakshi
Sakshi News home page

సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి

Jan 13 2015 11:03 AM | Updated on Sep 2 2017 7:39 PM

సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి

సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి

కంటోన్మెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూతురు సుహాసిని ఓటమి పాలైంది.

కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని ఓటమి పొందారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో  విజయం సాధించారు. 

 

మరోవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా 1వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కంటోన్మెంట్ 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement