'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు' | Sarve Satyanarayana takes on t congress leaders | Sakshi
Sakshi News home page

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

Mar 8 2015 6:34 PM | Updated on Sep 2 2017 10:31 PM

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు.

హైదరాబాద్ : టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టివిక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.  ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ... పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ముద్ర పడిందని గుర్తు చేశారు.

పొన్నాలను తొలగించాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పారని ఆరోపించారు. 2019 నాటి వరకు ఉత్తమ్ నాయకత్వాన్నే కొనసాగించాలని ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు జైపాల్రెడ్డి, డీఎస్లు మాట్లాడుతూ... యువనాయకత్వానికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఉత్తమ్, భట్టి విక్రమార్కలకు సహకరించాలని నేతలందరికి జైపాల్రెడ్డి, డీఎస్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement