ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చా

Saidi Reddy Canvass In Garidepally - Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  

సాక్షి, గరిడేపల్లి : నిస్వార్ధంగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, మంగపురం, కట్టవారిగూడెంలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రజలు ఓడించాలన్నారు. తనను ఓడించేందుకు ఉత్తమ్‌ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు మాత్రం తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండడన్నారు. కార్యక్రమంలో నాయకులు త్రిపురం అంజన్‌రెడ్డి, కడియం వెంకట్‌రెడ్డి, గుర్వయ్య, నర్సయ్య, ఆనంద్‌బాబు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 
ఆశీర్వదించండి.. సమస్యలను పరిష్కరిస్తాం
నేరేడుచర్ల : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని అశీర్వదించి గెలిపిస్తే గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మండలంలోని పెంచికల్‌దిన్నెలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పెంచికల్‌దిన్నె గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.  అనంతరం మాజీ సర్పంచ్‌ సుంకరి క్రాంతికుమార్, మాజీ ఎంపీటీసీ యల్లబోయిన లింగయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సోమగాని మురళీల ఆధ్వర్యంలో పలువురు సీపీఎం నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి శానంపూడి సైదిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కర్నాటి శ్యాం, శ్రీకాంత్, హరీష్, సావిత్రి, ప్రదీప్, నర్సయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 
ఉత్తమ్‌ను తరిమికొట్టాలి..
పాలకవీడు : గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ప్రాంతాన్ని సమస్యల నిలయంగా మార్చారని, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించని ఉత్తమ్‌ను తరిమి కొట్టాలని, టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిని బాధ్యతగా తీసుకుని పాటుపడతానన్నారు. సాగర్‌ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఈ గ్రామాల్లో సాగు, తాగు నీటికి ప్రాధాన్యం కల్పిస్తానన్నారు.  అనంతరం వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 90 మందికి  సైదిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యడు మలికంటి దర్గారావు, సై మండలాధ్యక్షుడు తాటికొండ వెంకటరెడ్డి, ఎంపీపీ రమావత్‌ గీతారాంచందర్, క్రాంతికుమార్, యామిని వీరయ్య, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి,  సైదులు, మార్కెట్‌ డైరెక్టర్‌ టి.వెంకటరెడ్డి, రామారావు, రాఘవరెడ్డి, అచ్చమ్మ  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top