నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు | rtc buses stops in secenderabad region | Sakshi
Sakshi News home page

నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు

Apr 23 2015 7:34 AM | Updated on Sep 3 2017 12:45 AM

తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

హైదరాబాద్: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. కంటోన్మెంట్ డిపోలో రెండు రోజుల క్రితం కార్మికులు విధులను బహిష్కరించిన విషయం తెలిసిందే. గురువారం మరోసారి మరిన్ని డిపోల్లో విధులకు హాజరుకాలేదు.

 

సికింద్రాబాద్ రీజియన్‌లోని రాణిగంజ్1, 2, కుషాయిగూడ, చెంగిచర్ల, హకీంపేటలో కార్మికులు విధుల్లోకి రాకపోవటంతో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement