ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం | RTC bus hit man killed | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

Aug 11 2015 1:08 AM | Updated on Sep 3 2017 7:10 AM

అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొనగా దుర్మరణం పొందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.

భువనగిరి అర్బన్  : అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొనగా దుర్మరణం పొందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూర్‌కు చెందిన బింగి ప్రేమ్‌కుమార్(28) వలిగొండలోని తన అత్తగారి ఇంటికి బైకుపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో  నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే భువనగిరి నుంచి నల్లగొండకు వెళ్తున్న యాదగిరిగుట్టడిపో బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది.
 
 ఎగిరిపడ్డ ప్రేమ్‌కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్‌కుమార్ బీబీనగర్‌లోని ఎంఎస్ కంపెనీలో పనిచేస్తుండేవాడని ఎస్‌ఐ భిక్షపతి తెలిపారు. మృతునికి భార్య సబిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement