సంతాన నాగదేవత సన్నిధిలో ఆర్పీ పట్నాయక్‌ | RP Patnaik Visited Temple | Sakshi
Sakshi News home page

సంతాన నాగదేవత సన్నిధిలో ఆర్పీ పట్నాయక్‌

Aug 20 2018 11:03 AM | Updated on Oct 16 2018 3:15 PM

RP Patnaik Visited Temple - Sakshi

పూజలు చేస్తున్న పట్నాయక్‌   

సిద్దిపేటజోన్‌ :  ప్రముఖ సంగీత దర్శకుడు, సీని నటుడు ఆర్పీ పట్నాయక్‌ కోటిపడగల సంతాన నాగదేవత ఆలయాన్ని ఆదివారం సందర్శించారు.  సిద్దిపేట పట్టణ శివారులో జరిగిన ఓ వివాహ వేడుకకు తన సోదరుడు గౌతమ్‌ పట్నాయక్‌తో హజరయ్యాడు. ఈ సందర్భంగా నాగదేవత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక నాగపూజ చేశారు. అనంతరం అక్కడే ఉన్న పంచముఖాంజనేయస్వామి, నవగ్రహ దేవాలయాలను సందర్శించుకున్నారు.

ఈసందర్భంగా ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ శక్తిస్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న కోటిపడగల సంతాన నాగదేవత ఆలయ దర్శనం ఆధ్యాత్మికతతో కూడిన ఆనందాన్ని కలిగిందన్నారు. సంతాన నాగదేవత దేవాలయ విశిష్టతను తెలుసుకోని దర్శించుకోవాలని వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దశరథం స్వామి , పూజారి శ్రీహరీలు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్‌ సిద్దిపేటకు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి చెరుకోని సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement