ఆలయంలో చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Sep 22 2015 4:33 PM | Updated on Aug 30 2018 5:27 PM

మండలంలోని కాట్నపల్లి రామలింగేశ్వరాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు.

సుల్తానాబాద్ (కరీంనగర్) : మండలంలోని కాట్నపల్లి రామలింగేశ్వరాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. కొంతదూరం తీసుకువెళ్లి హుండీని పగులగొట్టి అందులోని సొమ్ముతో ఉడాయించారు. స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ చీటి కేశవరావు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement