పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి వంట చేస్తున్న మహిళను స్పృహ తప్పేలా కొట్టి.. సొత్తును ఎత్తుకుపోయారు.
నేరేడుచర్ల (నల్లగొండ) : పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి వంట చేస్తున్న మహిళను స్పృహ తప్పేలా కొట్టి.. సొత్తును ఎత్తుకుపోయారు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జాన్‌పాడ్ రోడ్డులో ఉన్న రణబోతు శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆయన భార్య కవిత ఒక్కరే ఉన్నారు.
ఆ విషయం కనిపెట్టిన దుండగులు.. వంట చేస్తున్న కవితను వెనుక నుంచి తలపై గట్టిగా కొట్టటంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతోపాటు బీరువాలో ఉన్న రూ.60 వేల నగదును ఎత్తుకుపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో క్లూస్‌టీంను రప్పించి, వివరాలు సేకరించారు.