ఎన్టీఆర్‌ వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి | Revanth Reddy comments on NTR's death anniversary | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి

Jan 17 2017 2:42 AM | Updated on Aug 14 2018 11:02 AM

ఎన్టీఆర్‌ వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి - Sakshi

ఎన్టీఆర్‌ వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి

మాజీ సీఎం ఎన్‌.టి.రామారావు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం ఎన్‌.టి.రామారావు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయ గుర్తింపునిచ్చిన ఎన్టీఆర్‌ పట్ల విశ్వాసాన్ని చాటుకోవాలన్నారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను పొగుడుతున్న సీఎం కేసీఆర్, ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో ఆయన విగ్రహాల శుద్ధికి స్థానిక సంస్థలకు ఆదేశాలను ఇవ్వాలని సీఎంను కోరారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని నిర్ణయించినా, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement