రేవంత్ రెడ్డి కేసులో పురోగతి? | revanth reddy case | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి కేసులో పురోగతి?

Jun 4 2015 10:19 PM | Updated on Aug 29 2018 6:26 PM

రేవంత్ రెడ్డి కేసులో పురోగతి? - Sakshi

రేవంత్ రెడ్డి కేసులో పురోగతి?

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో పురోగతి కనిపిస్తోంది.

హైదరాబాద్: :నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో మరింత పురోగతి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు గాను ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అత్యధిక మొత్తంలో డబ్బులతో ఎరవేసిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో తవ్వినకొద్దీ నిజాలు బయటకొస్తున్నాయి.  ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే  టీడీపీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. 

 

ఆ క్రమంలోనే బ్యాంకు నుంచి రూ.2.50 కోట్లు డ్రా చేసినట్లు ఏసీబీ వద్ద ఆధారాలున్నట్లు సమాచారం. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్ము మరో నలుగురి అందజేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్ము నేరుగా ఓ సినీ నిర్మాత ఇంటికి చేరవేసి అక్కడ్నుంచి వ్యవహారం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై ఏసీబీ కొంత గోప్యత పాటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement