
సిద్దిపేట వాసులతో మాట్లాడుతున్న సీఐ జయేశ్‌రెడ్డి
జగిత్యాలరూరల్: జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన చేని శ్రావణ్‌కుమార్ వివాహం ఈనెల 20న ఉండగా సిద్దిపేటకు చెందిన ఏడుగురు బంధువులు, నుస్తాల్‌పూర్‌కు చెందిన ఇద్దరు దగ్గరి బంధువులు ఈనెల 15న అనంతారం గ్రామానికి వచ్చారు. 20న వివాహం జరిగింది. వివాహమైన తర్వాత తమతమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సిద్ధమవుతండగా 22న జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో 10 రోజులుగా వీరు బంధువుల ఇళ్లల్లోనే ఉంటున్నారు. కాగా గురువారం ఎలాగైనా స్వస్థలాలకు వెళ్లాలని పోలీసుల అనుమతి తీసుకునేందుకు జగిత్యాలకు కాలినడకన వచ్చారు. పోలీసులను సంప్రదించగా వెళ్లేందుకు వీలులేదని, మరో రెండు రోజులు బంధువుల ఇంట్లో ఉండాలని ప ట్టణ సీఐ జయేశ్‌రెడ్డి వారికి నచ్చజెప్పి పోలీ సు వాహనంలో గ్రామానికి తరలించారు.
పెళ్లివారి ఇంటికే పోలీస్ వాహనంలో తరలిస్తున్న అధికారులు