రేవ్ పార్టీపై పోలీసుల దాడి | rave party busted at rajendra nagar, 6 girls held | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

Oct 7 2014 10:42 AM | Updated on Mar 28 2018 11:05 AM

రేవ్ పార్టీపై పోలీసుల దాడి - Sakshi

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

రేవ్ పార్టీలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. శివారు ప్రాంతాల్లో జోరుగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: రేవ్ పార్టీలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. శివారు ప్రాంతాల్లో జోరుగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలోని బాబుల్రెడ్డి నగర్ లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరుగురు యువతులతో పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకోగా, మంగళవారం వరకు ఈ విషయం వెలుగులోకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిందితులను పోలీసులు అర్థరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టు తెలుస్తోంది. అలాగే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుడిని పోలీసు స్టేషన్ కు పిలిపించారని కూడా అనుమానాలు తావిస్తోంది. బడాబాబులను తప్పించేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement