తాగునీటి కోసం రాస్తారోకో | rastaroko for drinking water in nalgonda district | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం రాస్తారోకో

May 3 2016 9:28 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా చివ్వెంల గ్రామస్తులు తాగునీటి సమస్యను తీర్చాలని దాదాపు 200 మంది ఖాళీ బిందెలతో మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు.

చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల గ్రామస్తులు తాగునీటి సమస్యను తీర్చాలని దాదాపు 200 మంది ఖాళీ బిందెలతో మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. సూర్యాపేట - దంతుపల్లి రహదారిలో రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. గుక్కెడు నీళ్లులేక గ్రామస్తులు అల్లాడుతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి నీటి వసతి కల్పించేవరకూ ఆందోళన విరమించేది లేదని వారు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement