
'తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు'
ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని, చేసినతప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని, చేసినతప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు.
ఆ క్రమంలోనే న్యూస్ ఛానెళ్లకు నోటీసులు ఇప్పించారని, బాబు చర్యలను ఏపీ ప్రజలు కూడా హర్షించడంలేదని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన రసమయి.. బాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే మంచిదని హితవుపలికారు.