బేగం పేట రైల్వే స్టేషన్ లో టీటీలు ఓవరాక్షన్ చేశారు. కొంతమంది ప్రయాణికులను రైలు నుంచి దింపి రైల్వే స్టేషన్ గదిలో నిర్భందించారు.
సికింద్రాబాద్: బేగం పేట రైల్వే స్టేషన్ లో టీటీలు ఓవరాక్షన్ చేశారు. కొంతమంది ప్రయాణికులను రైలు నుంచి దింపి రైల్వే స్టేషన్ గదిలో నిర్భందించారు. ఈ ఘటన రైల్వే స్టేషన్లో కలకలం రేపింది. సిగరెట్ తాగిన వాసన వస్తుందంటూ ప్రయాణికులను తొలుత రైలు నుంచి దింపేసిన టీటీలు వారిని గదిలో బంధించారు. అయితే తమపై టీటీలు దాడి చేసి బలవంతంగా బంగార వస్తువులు తీసుకున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. దీనిపై రైల్వే పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
దీనిపై కొంతమంది ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరైన కారణం లేకుండా వారిని గదిలో నిర్భందించడంపై ప్రశ్నిస్తున్నారు.