రైలు కిందపడి ఉద్యోగి మృతి | railway employee died in train accident | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి ఉద్యోగి మృతి

Jan 23 2016 10:11 AM | Updated on Apr 3 2019 7:53 PM

రైలు దిగబోతూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి చక్రాల కింద పడి మృతి చెందాడు.

కారేపల్లి: రైలు దిగబోతూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి చక్రాల కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఏర్యాతండాకు చెందిన నూనావత్ రాములు (45) రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం మణుగూరు ప్యాసింజర్ రైలు ఎక్కిన అతడు కారేపల్లి స్టేషన్‌లో రైలు దిగబోతూ కాలు జారి పట్టాలపై పడిపోయాడు. రైలు అతడి పై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement